భద్రతా బలగాలకు తప్పిన ముప్పు

భద్రతా బలగాలకు తప్పిన ముప్పు

భద్రాచలం, వెలుగు : చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ అడవుల్లో కూంబింగ్‌‌‌‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు గురువారం ప్రమాదం తప్పింది. మావోయిస్టులు అమర్చిన మందుపాతరను సకాలంలో గుర్తించడంతో జవాన్లు ప్రమాదం నుంచి బయటపడ్డారు. భద్రతాబలగాలే లక్ష్యంగా సుక్మా జిల్లా కుంట బ్లాక్‌‌‌‌లోని కుంట-గొల్లపల్లి రహదారిలోని బండ గ్రామం వద్ద మావోయిస్టులు ఐదు కిలోల మందుపాతరను అమర్చారు.

డీఆర్జీ పోలీసులు, 228 బెటాలియన్‌‌‌‌ జవాన్లు ఇదే మార్గంలో కూంబింగ్‌‌‌‌కు వెళ్తున్నారు. అయితే బలగాల ముందు రహదారిని చెక్‌‌‌‌ చేసుకుంటూ వెళ్తున్న ఓ టీం మందుపాతరను గుర్తించింది. వెంటనే బాంబ్‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మందుపాతరను పేల్చి వేశారు. అనంతరం అదనపు బలగాలతో కూంబింగ్‌‌‌‌ చేపట్టారు.